12నెలల్లో దాదాపు 800 కారు అగ్నిప్రమాదలు..!!

- August 25, 2025 , by Maagulf
12నెలల్లో దాదాపు 800 కారు అగ్నిప్రమాదలు..!!

pic for illustrative purpose only..

మనామా: బహ్రెయిన్ లో కారులో అగ్నిప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కారు ప్రమాదాలను సీరియస్ గా తీసుకోవాలని,  భద్రతపరమైన చర్యలు చేపట్టాలని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది.  

బహ్రెయిన్‌లో కేవలం ఒక సంవత్సరంలో దాదాపు 800 కార్ల అగ్నిప్రమాదాలు నమోదయ్యాయని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మంత్రిత్వ శాఖ అమన్ ప్రోగ్రామ్ తాజా ఎపిసోడ్‌లో కల్నల్ ఒసామా బహార్ వెల్లడించారు. సాధారణ నిర్వహణను నిర్లక్ష్యం చేయడమే ఈ మంటలకు ప్రధాన కారణాలు అని పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, ఇంధన లీకేజీలు మంటలు చెలరేగడానికి సరైన పరిస్థితులను కల్పిస్తాయని చెప్పారు.

అలాగే, కార్ల లోపల పెర్ఫ్యూమ్‌లు, గ్యాస్ క్యానిస్టర్‌లు, క్యాంపింగ్ పరికరాలు లేదా పవర్ బ్యాంక్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పెట్టవద్దని కల్నల్ బహార్ హెచ్చరించారు. అవి తీవ్రమైన వేడిలో మండటం లేదా పేలిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయని అన్నారు. 

మంటలు చెలరేగి వాహనాన్ని పూర్తిగా కాల్చివేయడానికి దాదాపు 20 నిమిషాలు మాత్రమే పడుతుందని తెలిపారు.  BD 8 లభించే చిన్న అగ్నిమాపక యంత్రంతో తొలి కొన్ని నిమిషాల్లో త్వరగా చర్య తీసుకోవడం వల్ల తీవ్రమైన నష్టాన్ని నివారించడం ద్వారా ణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. 

డ్రైవర్లు ప్రమాద సంకేతాలను తీవ్రంగా పరిగణించాలని, ప్రాథమిక భద్రతా సాధనాలను, ముఖ్యంగా అగ్నిమాపక యంత్రాన్ని తమ వాహనాల లోపల పెట్టుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com