కువైట్ లో సముద్ర కాలుష్యానికి భారీ జరిమానాలు..!!
- August 26, 2025
కువైట్: కువైట్ తన సముద్ర పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. స్థానిక మరియు ప్రాంతీయ జలాలను కలుషితం చేస్తే కఠినమైన జరిమానాలను విధిస్తామని హెచ్చరించింది.
పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఆర్టికల్ 68 ప్రకారం, హానికరమైన పదార్థాలతో ఉద్దేశపూర్వకంగా సముద్రాన్ని కలుషితం చేసే ఎవరైనా 6 నెలల వరకు జైలు శిక్ష, 200,000 కువైట్ దినార్ల వరకు జరిమానా లేదా రెండింటినీ ఎదుర్కొంటారని పర్యావరణ ప్రజా అథారిటీ హెచ్చరించింది.
చట్టం పరిధిలోకి వచ్చే కాలుష్య కారకాలలో చమురు మరియు దాని వ్యర్థాలు, విషపూరితమైన లేదా హానికరమైన ద్రవాలు, శుద్ధి చేయని మురుగునీరు, రసాయనాలు, రేడియోధార్మిక పదార్థాలు, హానికరమైన లిక్విడ్స్ ఉన్నాయి. ఈ నిబంధనలు కువైట్ అంతర్గత జలాలు, ప్రాదేశిక సముద్రం మరియు చుట్టుపక్కల సముద్ర ప్రాంతాలకు వర్తిస్తాయని తెలిపింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్