ఈ నియమాలు పాటిస్తూ వినాయక చవితి చేస్తేనే పుణ్యం
- August 27, 2025
ప్రతి ఏడాది భాద్రపద శుక్ల పక్ష చవితి తిథినాడు వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున గణపతిని పూజించడం వల్ల ఇంట్లో శుభం, ఐశ్వర్యం నిలుస్తుందని విశ్వాసం. ఈ పండుగతోనే హిందూ పండుగల సీజన్‌కు తెరలేచినట్లే. అందుకే ఏ శుభకార్యం అయినా ముందు గణపతిని పూజించడం ఓ సంప్రదాయంగా మారింది.చాలా మంది భక్తులు ఈ రోజు పూజ చేస్తూ తెలియకపోయినా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇది పుణ్యం కోల్పోయేలా చేస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. కనుక ఈ రోజున పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి.ఈ సంవత్సరం చవితి తిథి ఆగస్టు 26, మంగళవారం మధ్యాహ్నం 1:54కి మొదలై, ఆగస్టు 27 మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం పండుగను సూర్యోదయంతో కూడిన తిథిలో జరపాలి. ఈ మేరకు ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 1:41 మధ్య పూజ చేయడం ఉత్తమం.
పూజకు ముందు ఏమేం చేయాలి?
పూజకు ముందు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంగా తయారు చేసుకోవాలి. శరీరం శుభ్రం చేసుకుని కొత్త దుస్తులు ధరించాలి. ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టి, లోపల సంబ్రాణి వేయాలి.తూర్పు దిశగా పసుపుతో ఓ పీఠం సిద్ధం చేయాలి. ఆపై తామరాకుపై మట్టి గణపతిని ప్రతిష్ఠించాలి. పసుపు, కుంకుమలతో పూజించి, పాలవెల్లిని అలంకరించాలి. వెండి లేదా రాగి కలశంలో గంగాజలాన్ని నింపి పక్కన ఉంచాలి.మొదట దీపారాధన చేసి, పసుపుతో చేసిన గణపతికి బెల్లం, అరటి పండు వేదించి హారతి ఇవ్వాలి. ఆపై పుష్పాలు, అక్షింతలు వేస్తూ గణపతికి అష్టోత్తర శతనామావళిని చదవాలి. ప్రత్యేకంగా 21 రకాల పత్రాలతో పూజ చేయాలి.
నైవేద్యం ఎలా ఉండాలి?
వినాయకునికి నైవేద్యంగా 21 రకాల పిండి వంటలు పెట్టాలి. ముఖ్యంగా ఉండ్రాళ్లు, మోదకాలు, కుడుములు తప్పకుండా ఉండాలి. ఇవన్నీ భక్తితో తయారు చేయాలి.పూజ పూర్తయిన తర్వాత వినాయక చవితి వ్రత కథను వినడం లేదా చదవడం చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు. ఆఖరిలో అక్షింతలు వేసుకుంటే పూజ పూర్తయినట్టు.అవును, ఉదయం మాత్రమే కాదు, సాయంత్రం కూడా పూజ చేయాలి. రెండుసార్లూ పూజ చేస్తే గణపతి కృప మరింత ఎక్కువగా ఉంటుందని పండితుల అభిప్రాయం.వినాయక చవితి పండుగను భక్తితో, నియమాలు పాటిస్తూ జరిపితే గణపతి ఆశీస్సులు మీ జీవితంలో శాంతి, ఐశ్వర్యం తీసుకొస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!