వీసా కాలపరిమితి మరోసారి కుదించిన ట్రంప్

- August 28, 2025 , by Maagulf
వీసా కాలపరిమితి మరోసారి కుదించిన ట్రంప్

అమెరికా: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రత్యేకంగా వలస వాదులపై తన ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. అక్రమవలసవాదులను బలవంతంగా స్వదేశాలకు పంపిన విషయం విధితమే. అంతేకాదు వీసాలపై కఠిన ఆంక్షల్ని తీసుకొచ్చారు. తాజగా వీసాల జారీపై కాలపరిమితిని విధించింది. కొత్త రూల్ ప్రకారం యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలపై కాలపరిమితిని విధించింది. ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి ఉండకుండా వీసా నిబంధనలను కఠినం చేయనుంది.

ప్రస్తుతం విదేశీ విద్యార్థులు ఎఫ్ 1వీసా (F1 visa)లపై అమెరికాలో చదువుకోవడానికి వస్తున్నారు. ఎక్స్ఛేంజ్ విజిటర్లు జే 1 వీసాలపై వస్తున్నారు. అయితే వీరి వీసా గడువు అయిపోయాక కూడా డ్యూరేషన్ ఆఫ్ స్టే తెచ్చుకుని అమెరికాలో ఉండొచ్చు. వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రామ్లో పాల్గొనాలనుకుంటే అంతకాలం ఉండొచ్చు. ఎక్స్ఛేంజ్ విజిటర్స్ గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్టులు, ట్రైనీలు, ఇంటర్న్లు, ఫిజీషియన్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. ఇప్పుడు దీన్నే మార్చేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైంది. ఇక మీదట ఈ వీసాలకు కొంతకాలం మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ కొత్తరూల్ భారత విద్యార్థులపై అత్యధిక ప్రభావం చూపనుంది. ప్రస్తుతం 3.3లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు. చదువు తర్వాత అమెరికా (America) లోనే ఉండి ఉద్యోగాలు సంపాదించుకుంటారు చాలామంది ఇకమీదట అలా చేయడం కుదరదు.

కొత్త నిబంధనలు ఇవే..
ఈ కొత్తప్రతిపాదనలను రేపు ఫెడరల్ రిజిస్ట్రీలో పబ్లిష్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రతిపాదనపై 30 నుంచి 60 రోజుల వరకు ప్రజాభిప్రాయాన్ని స్వీకరించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. మరోవైపు ఇలాంటి ప్రజాభిప్రాయాలు ఏమీ లేకుండానే తక్షణమే అమల్లోకి వచ్చేలా దీనిపై మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎఫ్, జే వీసా పొందిన విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు అమెరికాలో చదువుకునేందుకు గరిష్ట కాలపరిమితి నాలుగేళ్లుగా నిర్ణయించారు.

  • గ్రాడ్యుయేట్ స్థాయి ఎఫ్-1 విద్యార్థులు కోర్సు మధ్యలో ప్రోగ్రామ్లు మార్చుకుంటే కొత్త రూల్స్ అప్లికబుల్ అవఉుతాయి.
  • ఎఫ్-1 వీసాతో వచ్చే విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసా కోసం ప్రయత్నించేందుకు కూడా గ్రేస్ పీరియడ్ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించారు.
  • వీదేశీ మీడియా సంస్థల ప్రతినిధులు తీసుకునే ఐ-వీసాలతో 240 రోజుల వరకు అమెరికాలో ఉండొచ్చు. ఆ తర్వాత మరో 240 రోజుల వరకు తమ నివాస అనుమతిని పొడిగించుకునే అవకాశం కల్పిస్తున్నారు.
  • దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా చైనీస్ మీడియా ప్రతినిధులు అదనపు ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదిఏమైనా ట్రంప్ రోజుకో కొత్త వీసాల నిబంధనలు తీసుకొని వస్తున్నారు.
  • ఇప్పటికే వీదేశీవిద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, చైనా, రష్యా, జర్మనీ, సింగపూర్, దుబాయ్ వంటి దేశాలకు వెళ్లేందుకు ఆసక్తిని కనపరుస్తున్నారు. ట్రంప్ వీసా నిబంధనలు కఠినతరం చేయడం ఇప్పటికే అనేకులు స్వదేశానికి చేరుకున్నారు. ఉద్యోగాల్లో కూడా లేఆఫ్ లు ప్రకటిస్తుండడంతో ఇక చేసేది ఏమీ లేక స్వదేశాలకు పయనమవుతున్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com