'జంబో' ఆఫర్: కేవలం 1 ఖతార్ రియాల్‌కే LG స్మార్ట్ ఫోన్!

- July 16, 2015 , by Maagulf
'జంబో' ఆఫర్: కేవలం 1 ఖతార్ రియాల్‌కే LG స్మార్ట్ ఫోన్!

ఎలక్ట్రానిక్ ఉపకరణాల రీటేల్ దిగ్గజo, - జంబో ఎలక్ట్రానిక్స్ వారు, ఊరెడో షాహ్రీ 55 లేదా అంతకు పైన సబ్‌స్క్రైబ్ చేసే వినియోగదారులకు 1 GHz డ్యూయల్ కోర్ ప్రొసెసర్, 3" స్క్రీన్, 2 MP కెమెరా, ఆండ్రోయిడ్ కిట్ కాట్ ఆపరేటింగ్ సిస్టం, 32 GB  వరకు పెంచుకోగలిగిన 4 GB  ఇంటర్నల్ మెమరీ, 512 MB  రామ్ వంటి విశిష్టతలు కలిగిన LG 20 స్మార్ట్ ఫోన్ ను కేవలం ఒక్క ఖతార్ రియాల్‌కే అందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ షాహ్రీ 55 పధకం, 12 నెలలకు 30 శాతం తగ్గింపుతో కూడా లభిస్తుందని, స్మార్ట్ ఫోన్ ను ప్రతిఒక్కరికీ చేరువచేసే ఉద్దేశంతో ఈ ఆఫర్‌ను ఇస్తున్నట్టు సంస్థ వారి కధనం! ఐతే పరిమితకాలపు ఈ అవకాశం - ఏర్ పోర్ట్ రోడ్డు, సిటీ సెంటర్, బర్వా విలేజ్, అల్ నాస్సెర్, సౌక్  అల్ ఫలేః, మెశాయీర్ మాల్, అల్ ఖోర్ మాల్ లలోని ఊరెడో కియోస్క్‌లలో మాత్రమే ఉపలబ్దం.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com