సబ్జాతో ఎంతో ఆరోగ్యం
- July 16, 2015
వేసవి వచ్చిందంటే అనేక రకాల పళ్లు, కొబ్బరిబొండాలు, చల్లని పానీయాలు తాగుతుంటాం. పుదీనా జ్యూస్, లెమన్ జ్యూస్, గ్లూకోజ్ వాటర్ ఇలా చాలా రకాల శీతల పానీయాలు మన ఇంట్లో చేసుకున్నవి తాగుతుంటాం. అయితే వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది కేవలం సమ్మర్లో మాత్రమే కాకుండా మిగతా అన్ని కాలాల్లో కూడా తీసుకోవల్సింది సబ్జాగింజలతో చేసిన ఏ ఐటం అయినా సరే. సబ్జాగింజల్ని నీళ్లలో నానబెట్టి దానికి నిమ్మరసం, పంచదార కలిపి తీసుకునే పానీయం వేసవిలో దాహార్తిని తీర్చి శరీరానికి చాలా శక్తినిస్తుంది. సజ్జాగింజల్లో విటమిన్లూ, ఐరన్, పోషకాలూ పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి అందడమే కాక రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సబ్జా గింజలను నీళ్లలో నాలుగైదు గంటలు నానబెట్టి తరువాత ఆ నీటిని పారబోసి, పాలలో వేసుకుని, కొద్దిగా వెనిల్లా కలిపి తీసుకుంటే మధుమేహం ఉన్నవారికి మంచి మందుగా ఉపయోగపడుతుంది. అంతే కాదు సబ్జా గింజలను తరచూ తీసుకునేవారికి కడుపుబ్బరం, గుండెల్లో మంటలాంటి సమస్యలు తగ్గుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







