కడపజిల్లా లో మీ-సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- July 18, 2016
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో మీ-సేవ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మీ సేవ కేంద్రాలున్న గ్రామ పంచాయతీలు మినహా మిగతా వాటిలో ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థుల కనీస విద్యార్హత పదో తరగతి అని, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని పేర్కొన్నారు. ఆ గ్రామంలో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ ఉండాలన్నారు. దరఖాస్తుదారులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని నిర్ణయించిన తేదీలో వెరిఫికేషన్‌కు రావాలన్నారు. ఆన్లైన్ పరీక్ష ద్వారా మెరిట్ ప్రాతిపదికన మీ-సేవ కేంద్రం మంజూరు చేస్తామన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







