ఒమన్‌లో సెప్టెంబర్ చివరిలో ఐఫోన్ 17 సేల్స్..!!

- August 29, 2025 , by Maagulf
ఒమన్‌లో సెప్టెంబర్ చివరిలో ఐఫోన్ 17 సేల్స్..!!

మస్కట్: ఐఫోన్ 17 ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న లాంచ్ అవుతుంది. ఆ తర్వాత ఒమన్ మరియు ఇతర దేశాలలో అధికారికంగా విడుదల కానుంది. సెప్టెంబర్ చివరిలో రిటైలర్లు,  ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా మస్కట్‌లో ఎవరైనా దీన్ని కొనుగోలు చేయవచ్చు.  

ఆపిల్ తన వార్షిక ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న అమెరికాలోని కాలిఫోర్నియాలోని తన క్యాంపస్‌లో నిర్వహించనుంది.  ఈ కార్యక్రమంలో ఆపిల్ ఐఫోన్ 17 లైనప్‌ను ఆవిష్కరిస్తారు. ఇందులో సాధారణ మోడల్స్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మరియు ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడళ్లతోపాటు అల్ట్రా-థిన్ డిజైన్‌కు ప్రసిద్ధి చెందిన ఐఫోన్ 17 ఎయిర్ అనే కొత్త మోడల్ కూడా ఉంది. వీటితోపాటు ఆపిల్ వాచ్ అల్ట్రా 3, ఆపిల్ వాచ్ అల్ట్రా 3 మరియు ఆపిల్ వాచ్ SE 3 లతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 11 ను కూడా ఆవిష్కరించనున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com