నకిలీ కస్టమ్స్ పత్రాలతో పెట్రోలియం ఉత్పత్తుల రవాణా..!!

- August 30, 2025 , by Maagulf
నకిలీ కస్టమ్స్ పత్రాలతో పెట్రోలియం ఉత్పత్తుల రవాణా..!!

కువైట్: నకిలీ కస్టమ్స్ పత్రాలను ఉపయోగించి దేశం నుండి పెట్రోలియం ఉత్పత్తులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ముఠాను కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సమన్వయంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ అధికారులు అరెస్టు చేశారు. ఎగుమతి కోసం సిద్ధంగా ఉన్న 10 కంటైనర్లను సీజ్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కబ్ద్‌ లోని ఒక వ్యవసాయ క్షేత్రంపై దాడి చేసి, ఆ కంటైనర్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. 

ఐరన్  రవాణా షిప్‌మెంట్‌ల పేరుతో తీసుకున్న అనుమతుల్లో జాగ్రోస్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ మరియు ఆర్ట్ టవర్ జనరల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఫర్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌కు చెందిన పెట్రోలియం పదార్థాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది. ఈ స్మగ్లింగ్ ఆపరేషన్‌ను కువైట్ మునిసిపాలిటీలో పనిచేస్తున్న పౌరుడు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సార్జెంట్‌తో భాగస్వామ్యంతో భారతీయ, ఈజిప్షియన్ జాతీయులతో కలిసి నిర్వహించారని తెలిపారు.

ముగ్గురు భారతీయ అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారు దాదాపు ఎనిమిది నెలలుగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. నెలకు సగటున రెండు షిప్‌మెంట్‌లు వెళతాయన్నారు. కాగా,  షిప్‌మెంట్‌ల క్లియరెన్స్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షువైఖ్ పోర్ట్‌లోని కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ ప్రమేయాన్ని కూడా అధికారులు బయటపెట్టారు.

దేశం నుండి పారిపోయిన సిరియన్ జాతీయుడి నుండి అద్దెకు తీసుకున్న కాబ్ద్‌లోని భూమిని వ్యవసాయ ప్రయోజనాల కోసం కాకుండా పెట్రోలియం షిప్‌మెంట్‌ల నిల్వ మరియు తయారీ స్థలంగా చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com