షార్జా ఆత్మహత్య కేసు.. కొత్త ఆధారాల వీడియో వైరల్..!!
- September 01, 2025
యూఏఈ: గత నెలలో షార్జాలో మరణించిన భారతీయ మహిళ కేసులో కొత్త ఆధారాలు బయటపడ్డాయి. ఈ మేరకు కేరళ మీడియాలోకొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఆమె మరణానికి కొన్ని రోజుల ముందు తీసిన ఈ వీడియోలో మృతురాలు అతుల్య శేఖర్ ఏడుస్తూ, టేబుల్ చుట్టూ పరిగెడుతూ ఉండగా.. ఆమె భర్త సతీష్ శంకర్ ఆమెను కొడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.
అతుల్య తన 30వ పుట్టినరోజు జరుపుకున్న ఒక రోజు తర్వాత షార్జాలోని రోల్లాలోని తన ఫ్లాట్‌లో చనిపోయి కనిపించింది. షార్జా అధికారులు భారతీయ ప్రవాసి ఆత్మహత్య చేసుకుని మరణించిందని నిర్ధారించారు. ఆమె తల్లిదండ్రులు సతీష్‌పై డొమెస్టిక్ వయలెన్స్ కేసులు బుక్ చేయించారు. తాజాగా తమ వాదనకు మద్దతుగా కొత్త ఆధారాలను కోర్టులో సమర్పించారు. ఆ దంపతుల 10 ఏళ్ల కుమార్తె ఇప్పుడు అతుల్య తల్లిదండ్రులతో నివసిస్తోంది.
కాగా, ఈ నెల ప్రారంభంలో సతీష్ కేరళ రాజధాని తిరువనంతపురంలో దిగగానే అరెస్టు చేవారు. 40 ఏళ్ల ఈ వ్యక్తి జిల్లా కోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందాడు. అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!