లండన్‌లో సౌదీ ప్రయాణీకుడు హల్చల్.. విచారణ ప్రారంభం..!!

- September 01, 2025 , by Maagulf
లండన్‌లో సౌదీ ప్రయాణీకుడు హల్చల్.. విచారణ ప్రారంభం..!!

రియాద్:  సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ విమానంలోని ఒక ప్రయాణీకుడు అనుచిత ప్రవర్తనపై విచారణ ప్రారంభమైంది. ఆగస్టు 28న  బ్రిటిష్ రాజధాని లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే దాని తలుపు సదరు ప్రయాణికుడు తెరవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. కాగా, ఈ సంఘటనపై తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు సౌదీ అరేబియా జాతీయ రవాణా భద్రతా కేంద్రం తన X ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

 జెడ్డా నుండి లండన్‌కు వెళ్లే విమానం నంబర్ SV119లో సంఘటన గురించి తమకు నివేదిక అందిందని తెలిపింది. జెడ్డా నుండి లండన్‌లోని హీత్రో విమానాశ్రయానికి వెళ్తున్న సౌదీ విమానంలో విమానం ల్యాండింగ్ తర్వాత రన్‌వేపైకి వెళుతుండగా ఒక ప్రయాణీకుడు విమానం తలుపు హ్యాండిల్‌ను తరలించడానికి ప్రయత్నించాడని కేంద్రం వెల్లడించింది.

అయితే, విమానం ల్యాండింగ్ తర్వాత రన్‌వేపైకి వెళ్తుండగా, అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు భావిస్తున్న ప్రయాణీకుడు డోర్ హ్యాండిల్‌ను తరలించడానికి ప్రయత్నించాడని పేర్కొంది. విమాన సిబ్బంది పరిస్థితికి త్వరగా స్పందించి ప్రయాణీకుడిని విమానం తలుపు నుండి దూరంగా తీసుకెళ్లడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నట్లు  కేంద్రం తెలిపింది.

కాగా, ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు పూర్తి చేయడానికి సౌదీ ఎయిర్‌లైన్స్ మరియు బ్రిటిష్ అధికారులతో సమన్వయంతో పనిచేస్తుందని కేంద్రం తన ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com