ట్రాఫిక్ ఉల్లంఘనకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!

- September 01, 2025 , by Maagulf
ట్రాఫిక్ ఉల్లంఘనకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!

కువైట్: కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసఫ్ ట్రాఫిక్ చట్టంలోని నిబంధనల సవరణకు ఆమోదం తెలిపారు. అధికారిక గెజిట్ లో ప్రచురించిన ఒక నెల తర్వాత అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

తాజా సవరణల ప్రకారం.. ఇది కొన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు సోషల్ సర్వీస్, అవేర్ నెస్ కార్యక్రమాల్లో పాల్గొనే శిక్షలను విధించనున్నారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ జరిమానాలను విధించనున్నారు.

వీటితోపాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, విద్యా మంత్రిత్వ శాఖ కింద పాఠశాలలు మరియు అవగాహన డ్రైవ్‌లను నిర్వహించడంలో సహాయం చేయడం, మసీదులను శుభ్రపరచడం మరియు చెట్ల పెంపకం, తీరప్రాంతాలను శుభ్రపరచడం మరియు పర్యావరణ అథారిటీతో కలిసి పనిచేయడం, NGOల ద్వారా కమ్యూనిటీ, సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షలు విధించనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com