భద్రతాపరమైన సవాళ్లపై సలాలాలో సింపోజియం..!!

- September 02, 2025 , by Maagulf
భద్రతాపరమైన సవాళ్లపై సలాలాలో సింపోజియం..!!

సలాలా: దోఫర్ గవర్నరేట్‌లోని సలాలాలోని విలాయత్‌లోని సుల్తాన్ కబూస్ యూత్ కాంపౌండ్ ఫర్ కల్చర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కీలకమైన సౌకర్యాల భద్రతపై 4వ సింపోజియం ప్రారంభమైంది. మూడు రోజుల ఈ సింపోజియంను సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సర్వీసెస్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.

వివిధ రకాలైన ప్రమాదాలను ఎదుర్కొనేందుకు వినూత్న పరిష్కారాలను అందించడం ద్వారా భద్రతా పరమైన సవాళ్లపై ఈ సింపోజియంలో చర్చిస్తున్నారు. కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడం, సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం, భద్రతా సంస్థలు మరియు నిపుణుల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించడం వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా హాజరైన నిపుణులు చర్చిస్తున్నారు. ఈ సందర్భాంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ, పరికరాలను ప్రదర్శిస్తున్నారు.    

అలాగే, భద్రతలో ఏఐ పాత్ర, కార్యాలయాల్లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, చమురు మరియు గ్యాస్ పరిశ్రమల్లో కార్మికుల ఆరోగ్యం, భద్రత, పర్యావరణ సవాళ్లతోపాటు సైబర్ భద్రతపై పెద్దఎత్తున చర్చలు నిర్వహిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com