మెక్‌డోనాల్డ్స్ యాక్సిడెంట్: బాధితుల ఆవేదన
- July 19, 2016
అజ్మన్‌లోని మెక్‌డోనాల్డ్స్ ఔట్లెట్లో జరిగిన యాక్సిడెంట్లో మృతిచెందినవారి కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ ప్రమాదంలో భారతదేశానికి చెందిన 45 ఏళ్ళ మహిల, మరో చిన్నారి మృతి చెందారు. మృతి చెందిన మహిళ మూడు రోజుల క్రితయే యూఏఈకి వచ్చినట్లు ఆమె సోదరుడు మొహమ్మద్ రఫి చెప్పారు. మృతురాలి మనవడు ఈ ప్రమాదంలో గాపడ్డాడనీ, అతనిప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడని రఫి చెప్పారు. కుమార్తె, అల్లుడితో కలిసి ఆ సమయంలో మృతురాలు మెక్‌డోనాల్డ్స్‌కి వెళ్ళారని, అనూహ్యంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని రఫి కన్నీరు మున్నీరయ్యారు. 22 ఏళ్ళ ట్రక్ డ్రైవర్, ట్రక్‌పై కంట్రోల్ తప్పడంతో మెక్డోనాల్డ్స్లోకి దూసుకెళ్ళాడు ట్రక్‌తో సహా. సోషల్ మీడియాలో ఈ ఘటన పట్ల పలువురు స్పందించారు. మృతులకు ఘనంగా నివాళులర్పించారు.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









