కొత్త రికార్డును నెలకొల్పిన హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం..!!
- September 08, 2025
దోహా: ఖతార్ లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (DOH) ఈ ఆగస్టులో కొత్త రికార్డును నమోదు చేసింది. చరిత్రలో మొదటిసారిగా ఒకే నెలలో ఐదు మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించింది.
గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే ప్రయాణీకుల రద్దీలో 6.4% పెరుగుదల నమోదైంది. ఇక 5 మిలియన్ల మంది ప్రయాణీకులలో 1.3 మిలియన్లు పాయింట్-టు-పాయింట్ ప్రయాణికులు ఉండగా, ఈ విభాగంలో 12% వార్షిక వృద్ధి నమోదైంది. ఇది ఖతార్ నుండి/ఖతార్‌కు డైరెక్ట్ ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను హైలైట్ చేసింది.
ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) వరల్డ్ 2025 వరల్డ్ ఎయిర్‌పోర్ట్ ట్రాఫిక్ డేటాసెట్ విడుదల చేసిన ర్యాంకులలో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంగా నిలిచింది.
ఇటీవల వర్జిన్ ఆస్ట్రేలియా దోహాకు కొత్త సేవలను ప్రారంభించగా, ఫిలిప్పీన్ ఎయిర్‌లైన్స్ మరియు ఎయిర్ అరేబియా తమ సామర్థ్యాన్ని పెంచాయి. వీటితోపాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎయిర్ లైన్స్ తమ సర్వీసులను పెంచుతూ సేవలను విస్తృతం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్