మస్కట్ గవర్నరేట్‌లో సాంప్రదాయ మార్కెట్లకు కొత్త కళ..!!

- September 08, 2025 , by Maagulf
మస్కట్ గవర్నరేట్‌లో సాంప్రదాయ మార్కెట్లకు కొత్త కళ..!!

మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని సాంప్రదాయ మార్కెట్లు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. వాణిజ్య మరియు సాంస్కృతిక మైలురాళ్ళు, వారసత్వ స్ఫూర్తిని ఆధునికతతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సూక్‌లు అన్ని రకాల వస్తువులు, హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు కేంద్రంగా ఉండనున్నాయి. ముఖ్యగా సందర్శకులు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణీయ కేంద్రాలుగా నిల్వనున్నాయి. అత్యంత అద్భుతమైన సూక్‌లలో ముత్రా సౌక్, సీబ్ సౌక్, ఫ్రైడే మార్కెట్ మరియు రువి సౌక్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి స్వంత ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉన్నాయి.

ముత్రా సౌక్ అనేది ఒమన్‌లోని అత్యంత పురాతన మరియు ప్రసిద్ధ సౌక్. ఇది రెండు శతాబ్దాల నుంచి ఆభరణాలు, బంగారం, సాంప్రదాయ దుస్తులు,  సుగంధ ద్రవ్యాలు, ఒమానీ లుబన్, పురాతన వస్తువులు, బహుమతులు, హస్తకళలు వంటి ఉత్పత్తులకు కేంద్రంగా ఉంది. ఈ సౌక్‌లో 1,274 దుకాణాలు ఉన్నాయి.    

సీబ్ సౌక్ మస్కట్ గవర్నరేట్‌లోని అత్యంత వైవిధ్యమైన మార్కెట్. ఇది సుమారు 5,200 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో 125 వాణిజ్య దుకాణాలు, 28 తబ్రిజాలు ఉన్నాయి. ఇందులో దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, పరిమళ - సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు మరియు పండ్లను కొనుగోలు చేయవచ్చు. అలాగే అతిపెద్ద మాంసం మార్కెట్, చేపల మార్కెట్ , కాఫీ మార్కెట్ వంటి ప్రత్యేక మార్కెట్‌లు ఉన్నాయి.   

రువి సౌక్..ఇది మస్కట్ గవర్నరేట్‌లోని అత్యంత పెద్ద మార్కెట్‌లలో ఒకటి. ఇది హమ్రియా రౌండ్‌అబౌట్ నుండి రువి రౌండ్‌అబౌట్ వరకు ఉంది. ఇది బంగారం, ఆభరణాలు, వస్త్రాలు, దుస్తులు, పర్యాటక కార్యాలయాలు, ఎలక్ట్రానిక్స్ దుకాణాలు, బ్యాంకులకు కేంద్రంగా ఉంది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com