హాంగ్ కాంగ్ లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

- September 08, 2025 , by Maagulf
హాంగ్ కాంగ్ లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

హాంగ్‌కాంగ్: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య, గిడుగు రామమూర్తి పంతులు జయంతిని తెలుగు సాంస్కృతిక ఉత్సవంగా ఘనంగా నిర్వహించింది.

తెలుగు భాష వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు రామమూర్తి సేవలను స్మరించుకుంటూ, స్థాపక సభ్యురాలు జయ పీసపాటి తెలుగు భాషా ప్రాముఖ్యతను, దానిని నేర్చుకోవడంలో ఉన్న అవసరాన్ని వివరించారు.

ఈ కార్యక్రమంలో పిల్లలు తెలుగు భాష, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా క్లాసికల్, సెమీ క్లాసికల్, జానపద, టాలీవుడ్ పాటలతో నృత్యాలు ప్రదర్శించారు. అదనంగా కవితా పఠనం, కథా విన్యాసాలు, చిత్రకళా పోటీలు నిర్వహించబడ్డాయి.

ప్రతి ఏడాది ఈ వేడుకను ప్రత్యేకంగా పిల్లల అభిరుచులు, కళలను ప్రోత్సహించే వేదికగా నిర్వహిస్తున్నామని, దాదాపు రెండు దశాబ్దాలుగా వారాంతాల్లో తెలుగు తరగతులను నిర్వహిస్తూ సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులకు జయ పీసపాటి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులను అభినందిస్తూ, తెలుగు నేర్చుకోవడంలో చూపిస్తున్న ఆసక్తికి ప్రత్యేకంగా ప్రశంసలు అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com