EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం

- September 10, 2025 , by Maagulf
EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం

తిరుమల: ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో కార్య నిర్వ హణాధి కారిగా ఆత్మస్థైర్యంతో, మొండి పట్టుతో ప్రభుత్వం ఆదేశించిన విషయాలను సమర్దవంతంగా అమలుచేయడంలో ఒక ప్రత్యేకత చాటుకున్న సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ మళ్ళీ ఇఒగా రావడమే ఓ బ్రాండ్గా టిటిడి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

తొలిసారిగా ఇఒగా 2017లో నియామకం
గతంలో ఆయన ఇఒగా 2017లో నియమితులైన తొలిసారిగా కేంద్రంలోని ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు సిఫార్సుతో టిటిడిలోకి రావడం, ఆయన పనిచేసిన నాలుగుసంవత్సరాల కాలంలో ఉద్యోగుల పక్షపాతిగా… సమస్యల పరిష్కారంలో సున్నితత్త్వంతో వ్యవహరించారనే
చెబుతున్నారు. అప్పటి టిటిడి తిరుమల జెఇఒ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జెఇఒ పోలా భాస్కర్ల సహకారంతో సమష్టి కృషితో కొన్ని నిర్ణయాలను అమలు చేయగలిగారు. టిటిడి పాలనలో సుప్రీమ్ అయిన ధర్మకర్తలమండలి చైర్మన్, సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి పలు కీలక విషయాలను ముందుకు నడిపించిన సమర్థ అధికారిగా సింఘాల్ పేరుతెచ్చుకున్నాడు. 20195 సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకుల వడీ ంట్లు తగ్గడంతో ఆయా బ్యాంకుల్లో కాలపరిమితి “ముగిసిన డిపాజిట్ల ద్వారా వెంకన్నకు రాబడి తీసుకువచ్చే దిశగా ఆయన ఆలోచనతో కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో నగదు, బంగారు డిపాజిట్ చేయడానికి పథకం రచించారు. అధికవడ్డీరేటు ఇస్తారంటూ ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయించేలా చూశారు.

అయితే చివరకు విమ ర్శలు, ఆరోపణలు వచ్చినా ఒకటిరెండు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయించారు. దీనిపై అటు టిటిడి ఉద్యోగులు ఇటు ప్రజలకు ఎక్కడా సమాచార లోపం రానీయకుండా సానుకూల ధోరణితో సింఘాల్ ముందుకు నడిచాడు. 2019 మే నెలలో అప్పట్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారి వైసిపి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదికి పైగా ఆయన ఇఒగా కొనసాగారంటే సింఘాల్ పని తీరు ఏ పాటిదో అర్థమవుతుంది. 2019లోనే టిటిడి తిరుమల ఆలయంతోబాటు అనుబంధ ఆలయాల్లో సుదీర్ఘకాలంగా వయసుభారంతో అర్చకత్వం కొనసాగించిన ప్రధాన అర్చకులతో బాటు అర్చకులను పదిమంది వరకు పదవీ విరమణ చేయించి వారికి బెనిఫిట్స్ ఖాతాల్లో జమచేయించాడు. ఈ విషయంలో మాజీ ప్రధాన అర్చకులు ఏకంగా న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా, పలు రకాల ఆరోపణలు చేసినా సింఘాల్ బేఖాతర్ చేశారు. ఆ తరువాత అర్హత, అనుభవం ఉన్న అదే వంశస్థులైన అర్చకులను ప్రధానఅర్చకులుగా నియమించడంలో ఈయన సఫలీకృతులు కాగలిగారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com