'కిష్కింధపురి' అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: హీరో శ్రీనివాస్

- September 12, 2025 , by Maagulf
\'కిష్కింధపురి\' అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: హీరో శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సాన, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిధులు హాజరైన ఈ ప్రీరిలీజ్ వేడుకచాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులకు, మీడియాకు, నన్ను, సినిమాను ప్రేమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన అనిల్ రాపూడి గారికి బుచ్చిబాబు,సుస్మితకి ధన్యవాదాలు. వారు మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ  తెలుగు ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాని చాలా హార్డ్ వర్క్ చేసి చేసాం. 'కిష్కింధపురి సెప్టెంబర్ 12న మీ ముందుకు వస్తోంది.  భయ పెట్టడం కూడా ఒక ఆర్ట్. ఈ సినిమాతో ఆడియన్స్ ని భయపెడతాం. ఆడియన్స్ కు ఒక మంచి విజువల్, సౌండ్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఒక మంచి కథ చూశామనే  శాటిస్ఫాక్షన్ ఉంటుంది. అద్భుతమైన కథ చేసిన మా డైరెక్టర్ కౌశిక్ గారికి థాంక్యూ సో మచ్. కౌశిక్ ఈ సినిమాతో చాలా మంచివి స్థాయికి వెళ్తారు. చిన్మయి గ్రేట్ విజువల్స్ ఇచ్చారు. చైతన్ భరద్వాజ్ తన మ్యూజిక్ తో బద్దలు కొట్టేశారు. సెప్టెంబర్ 12న థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఫస్ట్ ఫ్రేం నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆడియన్స్ లీనమైపోతారు. ఒక సినిమాకి ఎంతోమంది కష్టం ఉంటుంది. ఎన్నో కలల తోటి చాలా కష్టపడి ఒక సినిమా చేస్తాం. మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటాం. మీరందరూ మా టీమ్ అందర్నీ సపోర్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మా సినిమానే గూస్ బంప్. కిష్కింధపురి మీ అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నేను చాలామంది ప్రొడ్యూసర్స్ చూశాను. సాహు గారు చాలా మంచి ప్రొడ్యూసర్. ఇంత మంచి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉండాలి. మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది. పది మంచి సినిమాలు వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఆయన నాతొ ఒక కమర్షియల్ సినిమా తీయాలని కోరుకుంటున్నాను. అర్చన గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ టీంకు  సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. అనుపమ నేను రాక్షసుడు తో మంచి హిట్ కొట్టాం. అందరూ రాక్షసుడు 2 ఎప్పుడు అని అడిగారు. కానీ దానికి మించిన సినిమా చేసాం. అదే కిస్కిందపురి. ఈ సినిమా చూశాక కిష్కింధపురి 2 ఎప్పుడని అడుగుతారు. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేసి ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ల అయింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా గర్వంగా ఉంది. కొంచెం వెలితిగా కూడా ఉంది. అది కిష్కింధపురి తీరుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ తో అది అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అందరికీ థాంక్ యూ.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఈ సినిమా ప్రమోషన్స్ తో కూడా భయపడుతున్నారు. డైరెక్టర్ కి ఆల్ ది వెరీ బెస్ట్. అనుపమ డిఫరెంట్ జాన్ర్స్  ట్రై చేస్తున్నారు. సాయి చాలా  వెరీ హార్డ్ వర్కింగ్  మెంటాలిటీ ఉన్న హీరో. తను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బిగ్ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. నిర్మాత సాహు గారితో నాకు ఎనిమిదేళ్లుగా జర్నీ. ఆయనతో కలిసి భగవంతుకేసరి సినిమా చేశాను. మేము కలిసి చేసిన ఫస్ట్ సినిమానే మా జీవితంలో ఒక మెమొరబుల్ మూవీ అయింది. ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా ఆయన నిర్మాణంలోనే చేస్తున్నాను. మా సినిమా రిలీజ్ అయిన సక్సెస్ అయ్యే ముందే కిష్కింధపురి సినిమా హిట్ అయి నాకు మంచి గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. నాకు హారర్ సినిమాలు అంటే భయం. కానీ ఈ సినిమా మా నిర్మాత సాహు గారి గురించి చూస్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్.

డైరెక్టర్ బుచ్చిబాబు సాన మాట్లాడుతూ... అందరికి నమస్కారం. సాహు గారు ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుతుంటారు. సాయి గారు సినిమా కోసం చాలా కష్టపడతారు. ఈ సినిమా రాక్షసుడులానే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అనుపమ గారు ఒక సినిమా ఒప్పుకున్నారంటే కచ్చితంగా అందులో కంటెంట్ ఉంటుందని నమ్మకం. డైరెక్టర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు.  కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ముందే వచ్చేస్తుంది. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.  

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సాహు గారితో ఇది నాకు రెండో సినిమా. వారి ప్రొడక్షన్లో పని చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. చాలా మంచి ఫుడ్ పెడతారు. సినిమాని ద బెస్ట్ క్వాలిటీ తో తీస్తారు. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఈ సినిమాకి ప్రతి ఒక్కరు చాలా హార్ట్ వర్క్ చేశారు. అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సాయితో ఇది నా సెకండ్ ఫిలిం. మేము కలిసి చేసిన ఫస్ట్ సినిమా రాక్షసుడు చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో ఒక డిఫరెంట్ సాయి ని చూశారు. ఈ సినిమాలో కూడా అంత డిఫరెంట్ గా ఉంటుంది. రాక్షసుడు లాగే ఇది కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అందరూ థియేటర్స్ లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను

ప్రొడ్యూసర్ సాహు గారపాటి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సుస్మిత గారికి, బుచ్చిబాబు గారికి, అనిల్ రావు పూడి గారికి థాంక్యూ సో మచ్. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. హారర్ సినిమాలో చాలా వస్తుంటాయి. కానీ ఇందులో హారర్ ఎలిమెంట్స్ తో పాటు ఒక బ్యూటిఫుల్ సోల్ ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్ విజువల్ ఎఫెక్ట్స్ అన్ని టెక్నికల్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సినిమా హాలీవుడ్ మూవీ స్టాండర్డ్ లో ఉంటుంది. సినిమా మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే షోస్ ముందే ప్లాన్ చేస్తున్నాం. మాతో పాటు మిరాయ్ సినిమా కూడా వస్తుంది. తేజ, టీంకి ఆల్ ది బెస్ట్.  రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చేసిన సాయి గారికి థాంక్యూ సో మచ్. సాయి గారికి అనుపమ గారికి ఇది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.

ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. హారర్ నా ఫేవరెట్ జానర్, ఈ  ట్రైలర్ అదిరిపోయింది. డైరెక్టర్ కౌశిక్ అద్భుతమైన విజువల్స్ చూపించారు. టైటిల్ తోనే ఒక సూపర్ నేషనల్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు. అనుపమ సాయి ద బెస్ట్ ఇచ్చారు. మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూడడానికి ఎదురు చూస్తున్నాను. సాయి గారికి సాహు గారికి అర్చన గారికి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. షైన్  స్క్రీన్ నుంచి ఏ సినిమా వచ్చిన ద బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ చేస్తారు.

డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ కథ విన్న వెంటనే నిర్మాత సాహు గారికి చాలా నచ్చింది. సాయి గారికి కూడా ఈ కథ చాలా నచ్చింది. విన్న వెంటనే చేస్తానని చెప్పారు. సాయి గారు సాహు గారు నమ్మడం వల్ల ఈ ప్రాజెక్టు జరిగింది. అనుపమ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా వాళ్ళిద్దరికీ ట్రైలర్ మేడ్. ఇద్దరు పెర్ఫార్మన్స్ చితకొట్టేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  

మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం సినిమా అనేది టీం వర్క్ ఎంతో మంది స్కిల్స్ కలిస్తేనే ఒక సినిమా బయటకు వస్తుంది ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నిర్మాత సాహు,అర్చన ఎంతో కంఫర్టబుల్ చూసుకున్నారు. కిస్కిందపురి మీ అందరికీ నచ్చుతుంది. ప్రతి ఐదు నిమిషాలకి ఒక హై మూమెంట్ ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. 100% సినిమా రీచ్ అవుతుంది. సినిమా యూనిట్ అందరూ పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com