వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం

- September 12, 2025 , by Maagulf
వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం

కాణిపాకం: దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం జరిగిన కల్పవృక్షవాహనసేవ సందర్భంగా ఉభయదారులచే స్వామివారికి అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకంను ఘనంగా నిర్వహించారు.ఈమేరకు ఉభయదారులైన దేవస్థానం కార్యనిర్వహణాధికారి, అర్చకులు మరియు ఆలయ సిబ్బంది స్వామివారికి అష్టోత్తర శత కలశ క్షీరాబిషేకంను నిర్వహించారు.

ఈమేరకు ఆలయ ఈఓ పెంచల కిషోర్, ఆలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు వందలాది మంది మంగళవాయిద్యాలు, కేరళవాయిద్యాలు, నవదుర్గ వేషధారణలు, విచిత్ర వేషాలు, తత్పెట గుళ్ళు వంటి ప్రత్యేక వైవిధ్యభరితమైన సాంస్కతిక ప్రదర్శనల నడుమ మణికంఠేశ్వరాలయం నుండి అష్టోత్తర శత కలశాలను గ్రామపురవీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయంలో అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపంలో వుంచి అష్టోత్తర శత కలశాలలోని పాలతో ఘనంగా అభిషేకించారు. అలాగే పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి చతుర్వేద పారాయణం గావించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు చేసి ధూపదీపనైవేద్యాలను సమర్పించారు. అనంతరం వేదపండితులు మంత్రపుష్పం గావించారు. ఈకార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్, డిప్యూటీ ఈఓ సాగర్బాబు, ఏఈఓ రవీంద్రబాబు, సూపరెండెంట్లు శ్రీధరాబాబు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజినాయుడు, చిట్టిబాబులతో పాటు ఆలయ, ఉత్సవ ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com