AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా

- September 14, 2025 , by Maagulf
AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా

రియాద్: సౌదీ అథారిటీ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (SAIP) కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిన ఒక వ్యక్తికి జరిమానా విధించింది. అతను పర్సనల్ ఫోటోను ప్రచురించాడని, ఏఐ ఉపయోగించి దానికి మార్పులు చేశాడని, కాపీరైట్ హోల్డర్ అనుమతి లేకుండా దానిని ఉపయోగించాడని  SR9000 జరిమానా చెల్లించాలని ఆదేశించారు.
పర్సనల్ ఫోటోలను ప్రచురించడం, AI ఉపయోగించి వాటికి మార్పులు చేయడం, కాపీరైట్ హోల్డర్ అనుమతి లేకుండా వాటిని వాణిజ్యపరంగా వినియోగించడం కాపీరైట్ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుందని అథారిటీ స్పష్టం చేసింది. మేధో సంపత్తి హక్కులను గౌరవించాలని, వాటిని ఉల్లంఘించకుండా ఉండాలని పిలుపునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com