భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- September 14, 2025
యూఏఈ: ఆసియా కప్‌లో భాగంగా నేడు(సెప్టెంబర్ 14న) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. దీనికి హాజరయ్యే అభిమానులకు దుబాయ్ పోలీసులు పలు సూచనలు చేశారు. క్రికెట్ అభిమానులు వేదిక వద్దకు తీసుకెళ్లడానికి అనుమతించని వస్తువుల జాబితాను వెల్లడించారు. యూఏఈ కాలమానం ప్రకారం.. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌కు 3 గంటల ముందు స్టేడియం గేట్లు ఓపెన్ అవుతాయని పోలీసులు తెలియజేశారు. లోపలికి ప్రవేశించాలనుకునే వారు చెల్లుబాటు అయ్యే టికెట్‌ను చూపించాలని సూచించారు.
అభిమానులు తమ కార్లను పార్కింగ్ చేయడానికి ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అభిమానులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని , నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. మైదానంలో వస్తువులను విసిరే లేదా మ్యాచు సమయంలో జాత్యహంకార భాషను ఉపయేగిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. రూల్స్ పాటించిన వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష, Dh30,000 వరకు జరిమానా విధించబడుతుందని దుబాయ్ పోలీస్ ఆపరేషన్స్ అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మరియు దుబాయ్‌లోని ఈవెంట్ సెక్యూరిటీ కమిటీ ఛైర్మన్ మేజర్ జనరల్ సైఫ్ మహర్ అల్ మజ్రౌయి హెచ్చరించారు.
మ్యాచు సందర్భంగా క్రికెట్ అభిమానులు రిమోట్-ఎలక్ట్రానిక్ పరికరాలు, పెంపుడు జంతువులు, చట్టవిరుద్ధమైన లేదా విషపూరిత పదార్థాలు, పవర్ బ్యాంకులు, ఫైర్ వర్క్స్, లేజర్ పాయింటర్లు, గ్లాస్ వస్తువులు, సెల్ఫీ స్టిక్స్, మోనోపాడ్‌లు, అంబ్రెల్లాలు, పదునైన వస్తువులు, సిగరేట్లు, ఔట్ సైడ్ ఫుడ్ అండ్ డ్రింక్స్, జెండాలు లేదా బ్యానర్లు వంటి వాటిని తీసుకు రావడాన్ని నిషేధించారు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!