50 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రత
- July 19, 2016
సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాలు రానున్న రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలతో విలవిల్లాడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 52 డిగ్రీల సెంటీగ్రేడ్‌ని మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మెటియరాలజికల్ డిపార్ట్‌మెంట్, ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపింది. వడగాల్పుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధికారులు పౌరుల్ని అప్రమత్తం చేస్తున్నారు. తూర్పు ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉంటుందని, కువైట్‌తోపాటు ఇరాక్ దక్షిణ ప్రాంతాల్లో 50 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వారు వివరించారు. మంగళవారం నుంచి కువైట్‌లో వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందనీ, క్రక్రమంగా సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాల్లోకి ఈ గాలులు విస్తరిస్తాయని అధికారులు తెలిపారు. గురు, శుక్రవారాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు అది కూడా 52 డిగ్రీల పైన నమోదవ్వచ్చని అంచనా.
తాజా వార్తలు
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









