కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- September 17, 2025
విజయవాడ: విజయవాడలోని కామినేని హాస్పిటల్ నందు అత్యంత సంక్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.110 కేజీల బరువున్న 65 ఏళ్ల మహిళకు మోకీలు మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించిన ఆర్థోపెడిక్, ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ షణ్ముఖ్ సరికొత్త రికార్డు సృష్టించారు.సాధారణంగా ఇంత ఎక్కువ బరువున్నవారికి.. అందునా, మెదడులో రక్తం గడ్డ కట్టిన వ్యక్తికి..ఈ తరహా మోకీలు మార్పిడి సాధ్యపడదు. అయితే, డాక్టర్ షణ్ముఖ్.. ఈ చికిత్సను విజయవంతంగా పూర్తిచేసి.. మరుసటి రోజే పేషెంట్ సాధారణంగా నడిచేలా చేయగలిగారు. ఈ అత్యంత అరుదైన, అతి సంక్లిష్టమైన శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు బుధవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో కామినేని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ మాట్లాడుతూ.. అసాధ్యమనుకున్న చికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ షణ్ముఖ బాబును అభినందించారు. కామినేని హాస్పిటల్స్ నందు అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండటంతో చికిత్స అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు. అత్యంత అనుభజ్ఞులైన వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య సంపత్తితో కామినేనిలో అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్సలను అందిస్తున్నామని డాక్టర్ వర్ధన్ వెల్లడించారు. అనంతరం, డాక్టర్ షణ్ముఖ్ తూమాటి మాట్లాడుతూ.. ‘మోకాలి నొప్పితో నడవలేని స్థితిలో ఉన్న 65 ఏళ్ల మహిళకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించాం.పేషెంటుకు బ్రెయిన్ లో చిన్న క్లాట్ కూడా వుంది. ఈ పరిస్థితుల్లో మోకీలు మార్పిడి శస్త్రచికిత్స చేయడం కుదరకపోవచ్చు. అయితే, హాస్పిటల్లోని వివిధ విభాగాల వైద్యుల సహకారంతో, బహుళ వైద్య సేవలను అందుబాటులో ఉంచుకుని అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను నిర్వహించాం.శస్త్రచికిత్స విజయవంతమై.. చికిత్స చేసిన మరుసటి రోజు నుండి పేషెంట్ సాధారణంగా నడవగలుగుతున్నారు’ అని వివరించారు. కామినేనిలోని అడ్వాన్స్డ్ ట్రామా సెంటర్ నందు అనేక క్లిష్టమైన చికిత్సలను నిర్వహిస్తూ వస్తున్నామని, వేరే ఆసుపత్రుల్లో చికిత్స చేయలేకపోయిన కేసుల్లో సైతం విజయవంతంగా చికిత్స చేసి.. అనేకమంది ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు.అన్ని విభాగాలు ఒకేచోట ఉండటంతో కామినేని హాస్పిటల్ మెరుగైన వైద్య చికిత్సలను అందించడంలో ముందంజలో ఉందని డాక్టర్ షణ్ముఖ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కామినేని క్లస్టర్ హెడ్ పి. సునీల్ కుమార్, మార్కెటింగ్ హెడ్ రమణారావు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక