రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!

- September 17, 2025 , by Maagulf
రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!

మస్కట్: ఒమన్ ఎయిర్ 2025లో అత్యంత రద్దీగా ఉండే ఖరీఫ్ సీజన్‌ను రికార్డులతో ముగించింది.  జూన్ ప్రారంభం నుండి ఆగస్టు చివరి వరకు రెండు లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒమన్ ఎయిర్ లో సలాలాకు ప్రయాణించారు. గతేడాది కంటే ప్రయాణికుల సంఖ్య 15శాతం  పెరిగింది. ఒమన్ పర్యాటక రంగానికి మద్దతుగా..  దేశీయ ప్రయాణాన్ని సులభతరం చేసినట్టు ఒక ప్రకటనలో ఒమన్ ఎయిర్ వెల్లడించింది. 

ఖరీఫ్ సమయంలో 70% కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒమన్ ఎయిర్ ను ఎంచుకున్నారని, OMR 54 రిటర్న్ ఛార్జీ ఆఫర్ కూడా ఒమన్ ఎయిర్ రికార్డు నమోదులో కీలక పాత్ర పోషిందన్నారు. కాగా  OMR 64 ఛార్జీ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుందని, ఇది సలాలా మరియు మస్కట్ మధ్య ప్రయాణించేవారు దాని నుంచి లాభం పొందాలని ఒమన్ ఎయిర్ గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అల్ మహరూకి తెలిపారు.  రాబోయే రోజుల్లోనూ ఒమన్ సాంస్కృతిక మరియు సహజ వారసత్వాన్ని ప్రోత్సహిస్తామని, ఇన్‌బౌండ్ పర్యాటకాన్ని పెంచడానికి ముందు వరుసలో ఉంటామని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com