జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!

- September 17, 2025 , by Maagulf
జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!

జెనీవా: ఖతార్‌కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది.  దోహాపై ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడిని ఖండిస్తూ 78 దేశాలు జెనీవాలోని UN మానవ హక్కుల మండలిలో సంయుక్త ప్రకటన చేశాయి. జెనీవాలోని UNకు దక్షిణాఫ్రికా శాశ్వత ప్రతినిధి రాయబారి మక్సోలిసి న్కోసి ఈ మేరకు వెల్లడించారు.

సెప్టెంబర్ 9న దోహాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత కౌన్సిల్ 60వ అత్యవసర సమావేశం నిర్వహించింది.  ఖతార్ సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు ఉమ్మడి ప్రకటన మద్దతును తెలియజేసింది. కౌన్సిల్ లోని ఆయా దేశాల ప్రతినిధులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. శాంతియుత దేశంపై బలప్రయోగం చేయడమేనని పేర్కొన్నారు.    

శాంతి మధ్యవర్తిత్వంలో ముందుండే ఖతార్ ను దాడులకు లక్ష్యంగా చేసుకోవడంపై  పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ శాంతి,  భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని హెచ్చరించాయి. మధ్యవర్తిత్వం వహించే దేశాలపై దాడులను పర్యవేక్షించి నివేదించాలని, అంతర్జాతీయ చట్టం ప్రకారం వారి రక్షణను బలోపేతం చేయాలని సంతకందారులు మానవ హక్కుల మండలి.. UN సెక్రటరీ జనరల్, మానవ హక్కుల హైకమిషనర్‌ను కోరింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com