భారత సంతతి మహిళకు ఒబామా మద్దతు
- July 20, 2016
అమెరికా సెనెట్ ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేయాలనుకుంటున్న భారత సంతతి మహిళ కమలా హారిస్‌కు ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా, ఉపాధ్యక్షుడు జో బిడెన్లు మద్దతు పలికారు. దీంతో ఆమెకు అవకాశాలు మెరుగైనట్లేనని భావిస్తున్నారు.
51ఏళ్ల కమలా హారిస్.. ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆమెను 'జీవితకాల కోర్టు గది ప్రాసిక్యూటర్'గా ఒబామా అభివర్ణించారు. అంతర్జాతీయ ముఠాలు, చమురు కంపెనీలు, తనఖా సంక్షోభానికి కారణమైన పెద్ద బ్యాంకులపై ఆమె పోరు సాగించారని కొనియాడారు.
'ఆమెను మీరు సెనెట్‌కు పంపితే.. కాలిఫోర్నియా ప్రజల తరఫున నిర్భయంగా పోరాడే యోధురాలవుతారు' అని ఒబామా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను ఎక్కడ్నుంచి వచ్చామనే విషయాన్ని మర్చిపోకుండా ప్రజల కోసం తన పోరాటం సాగించారని జో బిడెన్ ప్రశంసించారు.
కాగా, కమలా హారిస్.. వచ్చే నవంబర్‌లో జరిగే ఎన్నికల్లోపది సార్లు గెలిచిన డెమోక్రాట్ లొరెట్టా సంఛెజ్తో పోటీ పడనున్నారు. ఇది ఇలా ఉండగా, కమల.. ఆక్లాండ్‌లో జన్మించారు. ఆమె తల్లి 1960లో చెన్నై నుంచి వలస వెళ్లారు. కాగా, తండ్రి జెమైకన్ అమెరికన్.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









