టర్కీ ప్రభుత్వం కొరడా రుళిపిస్తోంది..

- July 20, 2016 , by Maagulf
టర్కీ ప్రభుత్వం కొరడా రుళిపిస్తోంది..

టర్కీ ప్రభుత్వం కొరడా రుళిపిస్తోంది. సైనిక కుట్రకు పాల్పడినవాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పటి వరకు ఎర్డగాన్ ప్రభుత్వం సుమారు 50 వేల మందిని టార్గెట్ చేసింది. అందులో కొందర్ని అరెస్టు చేయగా, మరికొందర్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది. అమెరికాలో ఉంటున్న ఫెతుల్లా గులెనే సైనిక తిరుగుబాటుకు పాల్పడ్డారని టర్కీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గులెన్ ఓ టెర్రరిస్టు సంస్థను నడిపిస్తున్నారని ప్రధాని బినాలి ఎల్దిరిమ్ అన్నారు. కుట్రకు పాల్పడినవాళ్లను కూకటివేళ్లతో తొలిగిస్తామన్నారు. గులెన్‌ను అప్పగించాలని అమెరికాను టర్కీ డిమాండ్ చేస్తోంది. బరాక్ ఒబామాకు ఫోన్ చేసిన ఎర్డగాన్ ఈ డిమాండ్ చేసినట్లు వైట్‌హౌజ్ ఓ ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com