'ఆంధ్రా కింగ్ తాలూకా' నుంచి ఉపేంద్ర బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

- September 18, 2025 , by Maagulf
\'ఆంధ్రా కింగ్ తాలూకా\' నుంచి ఉపేంద్ర బర్త్ డే  స్పెషల్ పోస్టర్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్, యూనిక్ ఎంటర్‌టైనర్‌ ఆంధ్రా కింగ్ తాలూక. మహేష్ బాబు పి దర్శకత్వంలో, ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అద్భుతమైన టైటిల్ గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ హిట్ సాంగ్స్ తో ఇప్పటికీ ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

ఈ చిత్రంలో ఉపేంద్ర ఆంధ్ర కింగ్ గా కనిపించనున్నారు. ఈ రోజు ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే ఆంధ్రా కింగ్' అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ అవతార్ లో ఉపేంద్ర అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.

ఆంధ్రా కింగ్ తాలూకా లో రామ్‌ డై-హార్డ్ సినిమా ఫ్యాన్ గా అలరించబోతున్నారు. ఇది ఒక అభిమాని బియోపిక్ గా ఉండబోతోంది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వివేక్ & మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

“ఆంధ్ర కింగ్ తాలూకా” నవంబర్ 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్  

సాంకేతిక సిబ్బంది:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ప్రొడక్షన్ హౌస్: మైత్రీ మూవీ మేకర్స్
సమర్పకులు: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ & T-సిరీస్ ఫిలిమ్స్
CEO: చెర్రీ
సంగీతం: వివేక్ & మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com