పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..
- September 21, 2025
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఓజీ’(OG) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న విడుదల కానుంది. విడుదల డేట్ దగ్గదపడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. వరుసగా సాంగ్స్, పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. అలాగే ట్రైలర్ విడుదల డేట్ ను కూడా విడుదల చేశారు.
తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో తీపి కబురు చెప్పారు మేకర్స్. సెప్టెంబర్ 21న సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ‘ఓజీ’ కాన్సర్ట్ నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఓజీ సినిమాలోని పాటల ప్రధానంగా ఈ వేడుక జరుగనుంది. అయితే, ఈ ఈవెంట్కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరవుతారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మిగతా చిత్ర యూనిట్ అంతా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎప్పుడు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బదులుగా ఈ ఈవెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!