డైరెక్టర్ సుజీత్ చెప్పిన వెబ్ సైట్ ఓపెన్ చేశారా?
- September 23, 2025
పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఎంతగానో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అసలు ప్రమోషన్స్ లేకుండానే సినిమాపై కావాల్సినంత హైప్ తెచ్చేసారు. ఇక డైరెక్టర్ సుజీత్ ని అయితే ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకుంటున్నారు. సుజీత్ కూడా పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ కావడం గమనార్హం. తాజాగా సుజీత్ ఓ వెబ్ సైట్ గురించి చెప్పి OG స్పెషల్ కంటెంట్ ఇస్తాను అని చెప్పడంతో ఆ వీడియో, వెబ్ సైట్ వైరల్ గా మారింది.
సుజీత్ మాట్లాడుతూ.. OG నుంచి ఓ స్పెషల్ కంటెంట్ ఇస్తాను. పది లక్షల మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీ ద్వారానే ఆ కంటెంట్ రిలీజ్ అవుతుంది. అందుకుhttp://www.oncemore.ioవెబ్ సైట్ ని చూడండి అని తెలిపాడు. ఇప్పటికే ఆ వెబ్ సైట్ ని నాలుగు లక్షల మంది వరకు ఓపెన్ చేసారు.
ఈ సైట్ ఓపెన్ చేస్తే.. కార్టూన్ లతో ఓ కథతో మొదలైంది. మొదట గంభీర(పవన్ కళ్యాణ్) జపాన్ గురువుని నేనెవరు, నా గతం ఏంటని అడుగుతాడు. ఆ తర్వాత మూడు లెవెల్స్ గేమ్స్ వస్తాయి. ఆ గేమ్స్ ఆడిన తర్వాత ఒక స్పిన్ గేమ్ వస్తుంది. ఆ స్పిన్ గేమ్ లో అదృష్టం ఉంటే మనకు గిఫ్ట్ లేదా OG టికెట్ వస్తాయి. ఆ తర్వాత మన పేరు, ఫోన్ నెంబర్ తీసుకుంటారు. అనంతరం మన పేరుతో పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఒక కార్డు చూపిస్తారు. అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చివర్లో నువ్వు సమురాయ్ ల రక్తం కోసం పోరాడావు అన్నట్టు ఓ డైలాగ్ వస్తుంది. చివర్లో సుభాష్ చంద్రబోస్ కూడా రావడం గమనార్హం.
ఇక సుజీత్ యుద్ధం అనుకున్న కంటెంట్ అనేది ఒక ఫోటో అని తెలుస్తుంది. పది లక్షల మంది సైట్ ఓపెన్ చేసి ఆ గేమ్స్ ఆడాక ఆ స్పెషల్ ఫోటో వస్తుందని తెలుస్తుంది. ఈ వెబ్ సైట్ తో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర పాత్రకు గతం ఉందని, గతంలో జపాన్ యోధులలో ఒకడని తెలుస్తుంది. దీంతో OG సినిమాకు ప్రీక్వెల్ ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ గేమ్ తో సినిమాపై మరింత హైప్ పెంచారు. చివర్లో సుభాష్ చంద్రబోస్ ని చూపించడంతో సినిమాలో ఇంకేం కొత్తగా చూపిస్తారో అని ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి