ఫుడ్ ఔట్‌లెట్స్‌పై తనిఖీలు, జరీమానాలు
- July 21, 2016
ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్లపై దొరికే ఆహార పదార్థాల్లో చాలావరకు శుభ్రత లేనివే ఉంటాయి. వేసవి సమయంలో వాటి కారణంగా తలెత్తే ప్రమాదాల తీవ్రత కూడా అధికంగానే ఉంటుంది. అందుకే దైద్ మునిసిపాలిటీ తనిఖీలు నిర్వహిస్తోంది. డైరెక్టర్ అలి ముస్సాబా అల్ తునైజి ఈ సందర్భంగా మాట్లాడుతూ మునిసిపాలిటీ ఇటీవలి కాలంలో జరిపిన తనిఖీల్లో పెద్దమొత్తంలో శుభ్రత లేని ఆహార పదార్థాలు బయటపడ్డాయనీ, వాటిని ధ్వంసం చేశామని చెప్పారు. 633 కిలోల మటన్, చికెన్, ఫిష్‌తోపాటు 375 కిలోల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, 1,411 కిలోల డ్రైడ్ ఫుడ్ స్టఫ్, 155 లీటర్ల ద్రవ ఆహార పదార్థాల్ని ఈ సందర్భంగా ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం 5,671 ఔట్‌లెట్స్‌లో తనిఖీలు నిర్వహించి 236 ఔట్‌లెట్స్‌కి జరీమానా విధించారు. 574 ఔట్‌లెట్స్‌కి హెచ్చరికలు జారీ చేశారు. ఫుడ్ ఔట్‌లెట్స్, రెస్టారెంట్లలో శుభ్రత ముఖ్యమని అలాగే ఆహార పదార్థాలు గడువు దాటి ఉండకూడదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









