దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- September 30, 2025
యూఏఈ: ప్రపంచంలోనే అతిపెద్ద పూల తోటగా పిలువబడే దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ప్రారంభమైంది. 150 మిలియన్లకు పైగా పువ్వులకు నిలయంగా ఉన్న ఈ గార్డెన్ 14వ సీజన్ కోసం కొత్తగా ముస్తాబైంది.
ABBA యొక్క మమ్మా మియా పాటకు పాఠశాల మార్చింగ్ బ్యాండ్ మోగుతుండగా, యూనిఫామ్‌లలో ఉన్న పాఠశాల పిల్లలు.. ఐకానిక్ హార్ట్ ఆకారపు ప్రవేశ ద్వారం గుండా గార్డెన్ లోపలకు ప్రవేశించారు. గులాబీ, పసుపు, తెలుపు మరియు పర్పుల్ రంగులలో అందమైన పువ్వులతో కూడిన ఆర్ట్ వర్క్ లు అందరిని ఆకట్టుకుంటున్నాయని మిరాకిల్ గార్డెన్ గ్రూప్ CEO మొహమ్మద్ జహెర్ హమ్మదిహ్ తెలిపారు. ఏడాది పొడవునా జాగ్రత్తగా చూసుకుంటామని, తమ దగ్గర అత్యాధునిక నీటిపారుదల వ్యవస్థ ఉందన్నారు.
కాగా, సమ్మర్ లో మొత్తం తోటను తొలగించి మళ్లీ నాటుతామని తెలిపారు. సీజన్ లో పువ్వుల థీమ్ లు ఒకటి కంటే ఎక్కువసార్లు మారుతాయని పేర్కొన్నారు. గార్డెన్ ను సందర్భించిన ప్రతిసారీ, కొత్త పూలు మరియు కొత్త మొక్కలను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి