రమదాన్ సంబరం - మాంసం ధరలు మరింత ప్రియం!
- July 17, 2015
ఈ సంవత్సరం రమదాన్ సందర్భంగా, బహ్రెయిన్ లో మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. బహ్రైన్ లైవ్ స్టాక్ కంపెనీ (BLC) వారి సమాచారం ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 1,40,000 గొర్రెల మాంసం, 5,500 బీఫ్ సరఫరా చేయబడ్డాయి. ఇది, గత సంవత్సరం కంటే 40 శాతం ఎక్కువని తెలిసింది. తమ వ్యయ నియంత్రణా చర్యలలో భాగంగా, ప్రభుత్వం మాంసంపై సబ్సిడీని ఆగస్టు 1 నుండి రద్దుచేయాలని, అందుకు బదులుగా బహ్రైన్ పౌరుల బాంకు ఖాతాలలోనే ఆ మొత్తం జమ ఔతుందని గతంలో ప్రకటించినప్పటికీ, పార్లమెంటు సభ్యుల నుండి వ్యతిరేకత వ్యక్తమవడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఐతే, ధరలు పెరుగుతాయనే భయంతో హోటళ్లు, రెస్టారెంట్లు ఇంకా ప్రజలు మాంసం కొనుగోలుకు ఎగబడడం ఈ పెరుగుదలకు కారణం అని BLC ఉపాధ్యక్షులు యూసిఫ్ అల్ సలేహ్ విశ్లేషించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







