ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!

- October 03, 2025 , by Maagulf
ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!

మస్కట్: గాజా స్ట్రిప్ కు అత్యవసర మానవతా సహాయంతో వెళ్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లాపై ఇజ్రాయెల్ దాడిని ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఇది అన్ని అంతర్జాతీయ మరియు మానవతా చట్టాల ఉల్లంఘనగా పేర్కొంది. ఇజ్రాయెల్ అధికారులు ఇటువంటి అమానవీయ చర్యలను కొనసాగించడం చూస్తే.. ఆకలిని యుద్ధ సాధనంగా ఉపయోగిస్తున్నారని, ఇది అత్యంత దారుణం అని ఒమన్ తెలిపింది.

పాలస్తీనా భూభాగాల్లోకి మానవతా సహాయాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా వెంటనే అనుమతించాలని ఒమన్ సుల్తానేట్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ ఉల్లంఘనలను ఆపడానికి మరియు పాలస్తీనా పౌరులను రక్షించడానికి అంతర్జాతీయ సమాజం తన చట్టపరమైన మరియు మానవతా బాధ్యతలను చేపట్టాల్సిన అవసరాన్ని ఒమన్ ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com