తమిళనాడులో కలాం వర్థంతి సందర్భంగా కోటి మొక్కలు
- July 21, 2016
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మొదటి వర్థంతి సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. జులై 27న ఆయన వర్థంతి సందర్భంగా తమిళనాడులోని పార్క్ ఇనిస్టిట్యూషన్స్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వీరు కోటి మొక్కలు నాటనున్నారు. జులై 26 అర్థరాత్రి నుంచి 27వ తేదీ అర్థరాత్రి వరకు కార్యక్రమం కొనసాగుతుందని పార్క్ ఇనిస్టిట్యూషన్స్ సీఈఓ అనుష్క రవి విలేకరులకు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల సహకారంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటించనున్నట్లు చెప్పారు. కలాం పేరుతో కొన్ని గ్రామాల్లో లైబ్రరీలు, పాఠశాలల్లో సైన్స్ అండ్ రీసెర్చ్‌పై శిక్షణ ఇవ్వడానికి క్లబ్స్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మీడియా సమావేశంలో పాల్గొన్న కలాం మనవడు ఏపీజేఎంజే షేక్ దావూద్ తెలిపారు.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







