జంటనగరాల్లో కుండపోత వర్షం
- July 21, 2016
భాగ్యనగరంలో గంట నుంచి భారీగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. దిల్సుఖ్ నగర్, ఫిల్మ్ నగర్, అమీర్‌పేట్, బాలానగర్, శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్, బోరబండ, సికింద్రాబాద్, వనస్థలీపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షం పడుతోంది. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వర్షపు భారీగా వచ్చి చేరడంతో నదీ ప్రవాహంలా తలపిస్తోంది. దీంతో నగరంలో నిత్య నరకప్రాయమైన ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వర్షంలో తడుస్తూనే పోలీసు వర్గాలు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తూ తమ సేవలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక పాదాచారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులు ఇంటికెళ్లలేక ఇబ్బందిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాల జనాలంతా తీవ్ర భయంతో వణికిపోతున్నారు. వరద నీరు ఇళ్ళల్లోకి ప్రవేసిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భారీ వర్షానికి కొన్ని ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







