కొత్త ఫీచర్లతో వాట్సాప్

- July 21, 2016 , by Maagulf
కొత్త ఫీచర్లతో వాట్సాప్

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టారు. కాల్‌బ్యాక్‌తో పాటుగా వాయిస్‌ మెసేజ్‌ పంపే సదుపాయం కల్పిస్తోంది. ఈ కాల్‌బ్యాక్‌, వాయిస్‌ మెయిల్‌ ఆప్షన్లు ప్రస్తుతం వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్‌ ద్వారా ఎవరికైనా కాల్‌ చేస్తే.. అవతలి వ్యక్తి కాల్‌ కట్‌ చేసినా.. ఎత్తకపోయినా వాట్సాప్‌ స్క్రీన్‌పై 'క్యాన్సిల్‌', 'కాల్‌బ్యాక్‌', 'రికార్డ్‌ వాయిస్‌ మెసేజ్‌' అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటి ఆధారంగా సులువుగా అవతలి వ్యక్తికి కాల్‌బ్యాక్‌ చేయొచ్చు.. లేదంటే కాల్‌ క్యాన్సిల్‌ చేయొచ్చు.. లేదంటే వాయిస్‌ మెసేజ్‌ పంపించొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందరికీ ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశముంది. ఇటీవలే వాట్సాప్‌ మెసేజింగ్‌లో వివిధ రకాల ఫాంట్స్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com