చర్మం ఆరోగ్యంగా కొత్తకాంతి తొ మెరవడానికి ..

- July 21, 2016 , by Maagulf
చర్మం ఆరోగ్యంగా కొత్తకాంతి తొ మెరవడానికి ..

వ యసూ, సరైన సంరక్షణ లోపించడం వంటి కారణాల వల్ల చర్మంలో బిగువు తగ్గుతుంది. . ఇలాంటప్పుడు వెలుపల దొరికే క్రీములు వాడటం కంటే సహజంగా సంరక్షణ చేసుకునేందుకు ప్రయత్నించండి. అందుకేం చేయాలంటే..
*
చర్మాన్ని ముడతలు లేకుండా కోమలంగా, బిగుతుగా ఉంచడంలో మంచినీళ్లది కీలకపాత్ర. ఇప్పటిదాకా పుష్కలంగా నీరు తాగే అలవాటు లేనివారు మార్పును ఆహ్వానించాల్సిందే. రోజూ కనీసం ఒకటిన్నర నుంచి రెండులీటర్ల నీరు తప్పనిసరిగా స్వీకరించండి. దానివల్ల చర్మానికి తేమ అందడంతోపాటు కోమలంగా మారుతుంది.
*
మనం తీసుకునే ఆహారం చర్మంపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా వేపుళ్లూ, జంక్‌ఫుడ్‌ వల్ల చర్మతత్వం దెబ్బతింటుంది. అందుకే, నూనె శాతం బాగా తక్కువగా ఉండే ఆవిరిపై ఉడికించిన ఆహారానికి ప్రాధాన్యత నివ్వాలి.
*
ముడతలు పడిపోయి...వేలాడుతున్నట్లుగా కనిపించే చర్మానికి కొత్త ఉత్తేజాన్నివ్వాలంటే ఆహారంలో తాజా పండ్లూ, కూరగాయలూ ఉండేలా చూసుకోవాలి. వాటిల్లోని యాంటీఆక్సిడెంట్లూ, విటమిన్లూ, ఖనిజాలకు ముడతలను తగ్గించే శక్తి ఉంటుంది. చర్మాన్ని తాజాగా, తేమగా కూడా ఉంచుతాయి. అదే సమయంలో మాంసకృత్తులున్న ఆహారాన్ని కూడా బాగా తీసుకునేందుకు ప్రయత్నించాలి.
*
ఎప్పటికప్పుడు మృతకణాలను తొలగించుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, తాజాగా మెరుస్తుంది. ఇందుకోసం మీరు పెద్దపెద్ద ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. రెండు చెంచాల ఓట్‌మీల్‌ పొడిలో కొద్దిగా వంటసోడా వేసుకుని, గోరువెచ్చని నీళ్లతో పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని, పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే చాలు. తేడా మీకే స్పష్టమౌతుంది.
*
ప్రతిరోజూ చర్మానికి మాయిశ్చరైజర్‌ తప్పనిసరి. ఈ చిన్న ప్రయత్నం చర్మాన్ని ముడతలు లేకుండా బిగుతుగా మారుస్తుంది. నాణ్యమైన మాయిశ్చరైజర్‌ని ఎంచుకుని, స్నానం చేసిన తర్వాత చర్మం కాస్త తడిపొడిగా ఉన్నప్పుడే రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com