మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- October 09, 2025
మనామా: జర్మన్ యూనిటీ 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ పాల్గొన్నారు. బహ్రెయిన్‌లోని షెరాటన్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలుదేశాల దౌత్యవేత్తలు, ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.
పాలస్తీనా సమస్యకు ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రాతిపాదనను డాక్టర్ అల్ జయానీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది ఈ ప్రాంతంలో న్యాయమైన, శాశ్వత మరియు సమగ్ర శాంతికి మార్గం సుగమం చేసే ఒక నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.
అదే సమయలో రెండు దేశాల ఏర్పాటుతోనే శాశ్వాత పరిష్కారం సాధ్యమవుతుందని మొదటినుంచి బహ్రెయిన్ బలమైన వాదనగా ఉందని మరోసారి గుర్తుచేశారు. శాశ్వత సామరస్యానికి పునాదిగా.. పాలస్తీనా-ఇజ్రాయెల్ దేశాల మధ్య దౌత్యపరమైన సహకారానికి బహ్రెయిన్ మద్దతు ఇస్తూనే ఉంటుందని తెలిపారు. మిలిలీస్టులో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ దేశాలు కూడా ముందుకురావాలని, స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
- ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..
- ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- చంద్రబాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్‌జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!