తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్

- October 11, 2025 , by Maagulf
తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్

హైదరాబాద్: తెలంగాణలో ఇంధన వినియోగం క్రమేపీ భారీగా పెరుగుతోంది. 2031-32 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ ఇంధన వినియోగంలో 58.71 శాతానికి పైగా వృద్ధిని సాధించనుంది. ఈ మేరకు దీనికి సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసింది. ముఖ్యంగా ఎలి, హెచిటి విద్యుత్ తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్ కనెన్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది. మరోపక్క దేశంలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్న ప్రధాన నగరాల జాబితాలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.

రాష్ట్రంలోని మొత్తం ఇంధన అవసరాల్లో హైదరాబాద్కు 30 శాతానికి పైగా ఉండటం విశేషం. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల సామర్థ్యం, బహుళ పరిశ్రమల అభివృద్ధి పెరుగుతున్న నేపధ్యంలో విద్యుత్ కనెక్షకు డిమాండ్ పెరిగింది. ఇందులో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఎస్పీడిసిఎల్ పరిధిలో 15 శాతం, ఎన్పీడీసీఎల్ పరిధిలో 6 శాతం పెరుగుదల నమోదైంది. వీటి పరిధిలో 2021-22 సంవత్సరం నాటికి రాష్ట్రంలో మొత్తం 1.70 కోట్ల విద్యుత్ సర్వీస్ కనెక్షన్లు ఉన్నాయి.

ఇందులో 1.21 కోట్ల గృహ విద్యుత్ కనెక్షన్లు, గృహేతర (వాణిజ్యం తదితర) కనెక్షన్లు 16.72 లక్షలు, పారిశ్రామిక రంగంలో 98,247 కనెక్షన్లు, వ్యవసాయానికి సంబంధించి 26.23 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇదే 2022-23 సంవత్సరానికి అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులలో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగదారుల సంఖ్య దాదాపు 2,06,19,263 కనెక్షన్లకు 2. 1,23,36,341 5 2 5, 17,25,414 ໖, 1,02,763 కనెక్షన్లు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అయితే 26,37,868కు పెరిగాయి. ఒక్క ఎస్పీడిసిఎల్ పరిధిలో ప్రతీ నెలా దాదాపు 37వేల చొప్పున ఏటా 4లక్షలకు పైగా కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరవు తున్నట్లు ఎస్పీడిసిఎల్ అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ గృహ విద్యుత్ కనెక్షన్లతో పాటు, పరిశ్రమలకు హెచి కనెక్షన్లు క్రమంగా పెరగడం విశేషం. 2020-22 సంవత్సరాల మధ్య విద్యుత్ కనెక్షన్లు ఏటా 7 నుండి 8శాతం పెరగ్గా, 2022-23 సంవత్సరం నాటికి ఇది రెండింతలు పెరిగి 15శాతానికి చేరుకుంది. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టుతో రాబోయే 5 నుండి 10 ఏళ్లలో 1000 మెగావాట్ల అదనపు డిమాండ్కు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com