స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి

- October 12, 2025 , by Maagulf
స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి

తమిళనాడులో చోటుచేసుకున్న దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తంజావూరు జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘోర ఘటనలో ఒక వ్యక్తి తన ముగ్గురు పిల్లలను స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి హత్య చేశాడు.సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.అతని పేరు వినోద్ కుమార్. జిల్లాలోని పెరియకోట సమీపంలో గల గోపాలసముద్రం అతని స్వస్థలం. స్థానికంగా ఫొటోగ్రాఫర్ గా పని చేస్తోన్నాడు.12 ఏళ్ల కిందట పట్టుక్కోట్టైకి చెందిన నిత్య అనే యువతిని పెళ్లాడారు. వారికి 11 ఏళ్ల ఒవియా, ఎనిమిదేళ్ల కీర్తి, అయిదేళ్ల ఈశ్వరన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

నిత్యకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మన్నార్‌గుడికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది.భర్త, పిల్లలను పట్టించుకోకుండా, నిత్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ వ్యక్తితోనే ఎక్కువ సమయం గడిపేది.ఆరు నెలల కిందట భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో వినోద్ కుమార్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

మన్నార్ గుడికి వెళ్లి నిత్య (Nitya) ను కలిసి, తనతో రావాలని బతిమాలాడు. ఆమె ఇందుకు నిరాకరించింది. ప్రియుడితోనే ఉంటానని స్పష్టం చేసింది. ఫలితంగా- భార్యపై కోపం పెంచుకున్న వినోద్ కుమార్ పిల్లలపై చూపాడు. ముగ్గురినీ హతమార్చాలని భావించాడు. తొలుత పిల్లలకు స్వీట్లు కొనిచ్చాడు.

అందులో మత్తుమందు కలిపాడు. మత్తులో ఉన్న తర్వాత ఒకరి తర్వాత ఒకరిగా గొంతు కోసి చంపాడు. ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. చేసిన నేరాన్ని అంగీకరించాడు.

గొంతు కోయడానికి ఉపయోగించిన కత్తినీ పోలీసులకు అప్పగించాడు.తన భార్య అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయిందనే ఆగ్రహంతోనే వినోద్ కుమార్ ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com