కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- October 12, 2025
కువైట్: కువైట్ లోని పలు ప్రాంతాల్లో వాటర్ కొరత వేధిస్తోంది. ప్రస్తుతం అనేక వాటర్ ఉత్పత్తి ప్లాంట్లలో నిర్వహణ కార్యకలాపాల కారణంగా కొరత ఏర్పడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొరతను తీర్చేందుకు దేశంలోని వ్యూహాత్మక నిల్వల నుండి వాటర్ ను తీసుకుంటున్నట్లు తెలిపింది. అదే సమయంలో వాటర్ ఉత్పత్తిని ముమ్మరం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.
మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం.. నీటి వినియోగం 501 మిలియన్ గ్యాలన్‌లకు చేరుకుంది. ఇది 446 మిలియన్ గ్యాలన్ల ఉత్పత్తి రేటును అధిగమించింది. 55 మిలియన్ గ్యాలన్ల తేడా నమోదైంది. మంత్రిత్వ శాఖ ప్రస్తుతం 3,275 మిలియన్ గ్యాలన్ల వ్యూహాత్మక నీటి నిల్వలను కలిగి ఉంది.
రాబోయే వేసవి కాలానికి సన్నాహకంగా మంత్రిత్వ శాఖ విద్యుత్ ప్లాంట్లు, వాటర్ ప్లాంట్లలో నిర్వాహణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, నీటి ఉత్పత్తి అధిక ఖర్చుతో కూడు కున్నదని, పౌరులు మరియు నివాసితులు నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!