అఖండ 2: తాండవం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా
- October 13, 2025
'గాడ్ ఆఫ్ ది మాసెస్' నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డైనమిక్ అండ్ పవర్ ఫుల్ ఫోర్త్ కొలాబరేషన్ లో మోస్ట్ అవైటెడ్ హై-ఆక్టేన్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం' పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్ భారీ బజ్ క్రియేట్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది.
సెన్సేషనల్ కంపోజర్ తమన్ తాజాగా అఖండ 2 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రారంభించారు. పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులు సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యంతో ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు ఈ ప్రతిభావంతులైన సోదరులు అఖండ 2తో సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.
#థమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో వీరు సంస్కృత శ్లోకాలతో మంత్ర ముగ్ధులను చేయబోతున్నారు. ఈ శ్లోకాలు, వేద మంత్రాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెచ్చేలా వుండబోతున్నాయి. థమన్ అందిస్తున్న పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హై వోల్టేజ్ ఎనర్జీ అందించబోతోంది.
ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు.
సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
పవర్ ఫుల్ టీమ్, భారీ అంచనాలతో రాబోతున్న అఖండ 2: తాండవం గ్రేట్ స్పిరుచువల్, యాక్షన్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: C రాంప్రసాద్, సంతోష్ D Detakae
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!