బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!

- October 16, 2025 , by Maagulf
బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!

మనామా: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్టోబర్ 16–17 తేదీలలో ప్రవాస సంగమం కోసం బహ్రెయిన్‌లో పర్యటించనున్నారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆయన బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు.  తన పర్యటనలో భాగంగా మలయాళం మిషన్ మరియు లోక కేరళ సభ సభ్యులు నిర్వహించే గ్రాండ్ ప్రవాసీ సంగమంలో పాల్గొంటారు. ఇది అక్టోబర్ 17న సాయంత్రం 6:30 గంటలకు బహ్రెయిన్ కేరళీయ సమాజం (BKS)లో జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయన్ ముఖ్య అతిథిగా పాల్గొని మలయాళీ ప్రవాస సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి భారత రాయబారి వినోద్ కె. జాకబ్, మంత్రి సాజి చెరియన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. జయతిలక్ మరియు పారిశ్రామికవేత్త ఎం.ఎ. యూసుఫ్ అలీ వంటి అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు.  ఈ మేరకు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ పి.వి. రాధాకృష్ణ పిళ్లై మరియు జనరల్ కన్వీనర్ పి. శ్రీజిత్ ప్రకటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com