రియో ఒలింపిక్స్ కి వెళ్లనున్న మాస్టర్ బ్లాస్టర్
- July 22, 2016
రియో ఒలింపిక్స్ క్రీడా సంబరంలో పాల్గొనాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాక్ ఆహ్వానించారు. తెందుల్కర్ ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ జరుగనున్న రియోడిజెనిరో నగరానికి ఆగస్టు 2న చేరుకొని గేమ్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులను సచిన్ ఉత్సాహపరచనున్నట్లు సమాచారం. జికా వైరస్‌తో ముప్పున్న బ్రెజిల్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన వారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్‌ను సచిన్ ఈ మధ్యే ముంబయిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వేయించుకున్నాడు. గత కొద్ది రోజుల క్రితం లండన్‌లో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సచిన్ రియో ప్రయాణానికి సంసిద్ధమై అక్కడ భారత క్రీడాకారులకు మద్దతు పలికేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







