మోటార్‌సైకిలిస్టు మృతి..డ్రైవర్ కు జైలు శిక్ష..!!
- October 21, 2025
మనామా: బహ్రెయిన్ లో ఓ మోటార్‌సైకిలిస్టు మృతికి కారణమైన డ్రైవర్ కు మొదటి హై క్రిమినల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కోర్టు వ్యాఖ్యానించింది. రోడ్డుపై సురక్షితమైన దూరం పాటించడంలో డ్రైవర్ వైఫల్యం కారణంగా సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మోటార్‌సైకిలిస్ట్ గాల్లోకి ఎగిరి అత్యవసర లేన్‌లో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. సంఘటనా స్థలంలోనే అతను మరణించాడు. డ్రైవర్ వాహనం కూడా బోల్తా పడింది. మరో రెండు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.
అజాగ్రత్తగా డ్రైవ్ చేసి వ్యక్తి మరణానికి కారణమైనందుకు, ఇతరుల కార్లకు నష్టం కలిగించాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ డ్రైవర్‌పై అభియోగాలు మోపింది. డ్రైవర్ రహదారి భద్రతా నియమాలను పాటించి ఉంటే ఈ విషాదాన్ని నివారించే అవకాశం ఉండేదని దర్యాప్తు రిపోర్టులో అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- అమెరికా H-1B వీసా ఫీజు పై సంచలన నిర్ణయం
- నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..
- విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- దీపావళి వేడుకలు.. 19 మందికి గాయాలు
- మోటార్‌సైకిలిస్టు మృతి..డ్రైవర్ కు జైలు శిక్ష..!!
- ఖతార్ లో O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్..!!
- ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- 20 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ లేన్ క్లోజ్..!!
- సౌదీ అరేబియాలో రిక్రూట్ మెంట్ కంపెనీలపై కొరడా..!!
- యూఏఈలో ఘనంగా దీపావళి వేడుకలు..!!