నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..
- October 21, 2025
నిజామాబాద్‌లో నిందితుడు రియాజ్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమోద్ కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలం, రిటైర్మెంట్ ఏజ్ ఎంత వరకు ఉందో అంతవరకు జీతం, కుటుంబంలో ఒకరికి జాబ్ ఇస్తామని చెప్పారు. బలిమెల రిజర్వాయర్ ఘటనకు సంబంధించి 33 మంది పోలీసు కుటుంబాలకు ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున స్థలాన్ని గాజులరామారంలో కేటాయిస్తామని చెప్పారు.
“పోలీస్ అంటే ఒక భరోసా. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరులకు ఘన నివాళులు. 1959 అక్టోబర్ 21న భారత్-చైనా సరిహద్దులో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు. అప్పటి నుంచి మనం అక్టోబరు 21న అమరవీరులను స్మరించుకుంటున్నాం. దేశం కోసం ఎందరో పోలీస్ అమరవీరులు అయ్యారు.
తెలంగాణ రాష్టంలో ఈ ఏడాది ఆరుగురు పోలీసులు వీర మరణం పొందారు. దేశ వ్యాప్తంగా 191 మంది పోలీసులు అమర వీరులు అయ్యారు. మూడు రోజుల క్రితం నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అమరుడయ్యారు.తీవ్ర వాదం, సైబర్ నేరాలు, మాదక ద్రావ్యాలు పెరగకుండా అదుపులోకి తీసుకురావడంలో పోలీస్ శాఖ కృషి బాగుంది.
డ్రగ్స్ నిర్మూలన చెయ్యడం కోసం ఈగల్ ను ఏర్పాటు చేశాం. సైబర్ నేరాలు, డిజిటల్ నేరాలు పెద్ద సవాల్ గా మారుతున్నాయి. సాంకేతికతతో నేరాలను అదుపు చెయ్యడంలో తెలంగాణ పోలీస్ శాఖ బెస్ట్ గా నిలిచింది. మావోయిస్టు కార్యకలాపాలు కట్టడి చెయ్యడంలో పోలీస్ పనితీరును మరచిపోలేం.
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నాను. క్రీడాకారులకు పోలీస్ ఉద్యోగాలు ఇచ్చాము. పోలీస్ శాఖ ఇదే పనితీరును కొనసాగించాలి. దేశంలోనే మన పోలీస్ అగ్రగామిగా నిలిచింది” అని రేవంత్ రెడ్డి అన్నారు.
పోలీసుల త్యాగాలు మరచిపోలేం: డీజీపీ
పోలీసుల త్యాగాలు మరచిపోలేమని, ఈ సంవత్సరం 191 మంది పోలీసులు అమరులయ్యారని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు.
శాంతి భద్రత లు కాపాడడం లో పోలీసుల సేవలు మర్చిపోలేము. నేరాలను అదుపులో చెయ్యడంలో పోలీస్ శాఖ అనేక నూతన సంస్కరణ లను తీసుకొచ్చింది. తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ఉత్తమ పోలీసింగ్ గా ప్రతిభ కనబరించింది. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుంది. వారి త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది.పోలీస్ అమరవీరుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.
తాజా వార్తలు
- చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్
- నవీ ముంబై అగ్ని ప్రమాదం: నలుగురు దుర్మరణం
- అమెరికా H-1B వీసా ఫీజు పై సంచలన నిర్ణయం
- నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..
- విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- దీపావళి వేడుకలు.. 19 మందికి గాయాలు
- మోటార్‌సైకిలిస్టు మృతి..డ్రైవర్ కు జైలు శిక్ష..!!