రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!

- October 22, 2025 , by Maagulf
రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!

రియాద్: రియాద్ లో జనాభా వివరాలను సేకరించే డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభమైంది. జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ సహకారంతో రియాద్ నగర రాయల్ కమిషన్ (RCRC) ఈ సర్వేను నిర్వహిస్తుంది.  జనాభా వివరాలతోపాటు నివాసితుల సామాజిక, విద్యా మరియు ఆర్థిక పరిస్థితులు, వలసదారుల వివరాలను సర్వేలో సేకరిస్తున్నారు. 

అధునాతన డిజిటల్ పరికరాల సాయంతో క్షేత్ర స్థాయిలో డేటాను సేకరిస్తున్నారు. రియాద్ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి ఈ సర్వే డేటా ఉపయోగపడుతుందని రాయల్ కమిషన్ వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com