ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సదస్సుకు కెటిఆర్ కు ఆహ్వానం

- October 23, 2025 , by Maagulf
ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సదస్సుకు కెటిఆర్ కు ఆహ్వానం

హైదరాబాద్: తెలంగాణ మాజీ ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు(KTR) మరో అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంకలోని కొలంబోలో జరగబోయే ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ (GETS)- 2025 సదస్సులో కీలకోపన్యాసం చేసేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. ఈ సదస్సు నవంబర్ 10 నుంచి 12, 2025 వరకు కొలంబోలోని ది కింగ్స్‌బరీ హోటల్‌లో జరగనుంది.

శ్రీలంక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరఫున, జీఈటీఎస్(GETS) శ్రీలంక డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎ.యు. ఎల్.ఎ. హిల్మీ ఈ ఆహ్వానాన్ని కేటీఆర్‌కు పంపారు. ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి రంగాలలో తెలంగాణను భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ పోషించిన పాత్రను డాక్టర్ హిల్మీ తన లేఖలో కొనియాడారు. ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నాయకులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకురానుంది.

కేటీఆర్ పాల్గొనడం వల్ల దక్షిణ ఆసియాలోని విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు స్ఫూర్తి పొందుతారని జీఈటీఎస్-2025 సదస్సు కార్యదర్శి తెలిపారు. అలాగే, సాంకేతిక, ఆర్థిక వృద్ధిలో భారతదేశం-శ్రీలంక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ పెద్ద ఎత్తున పారిశ్రామిక, సాంకేతిక కార్యక్రమాలను నడిపించిన విధానం అనేక వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ఒక ఆదర్శంగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల మంత్రులు, పెట్టుబడిదారులు, స్టార్టప్ నాయకులు, ఆవిష్కర్తలు హాజరవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com